Jogi Ramesh Open Challenge : నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్ధన్ వీడియో విడుదల చేయడంతో.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. అయితే, ఆ వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడం సంచలనంగా మారింది.. మరోవైపు, ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది సర్కార్.. అయితే, ఆ వీడియోపై స్పందించిన జోగి రమేష్.. సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.. సిట్ చీప్ చంద్రబాబు.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతోందని విమర్శించారు.. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే సిట్ వేశారన్న ఆయన.. CBN.. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్… ఇది సిట్ అని విమర్శించారు.. మేం అడిగింది ఈ సిట్ కాదు. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం.. పనికిమాలిన కేసులో నన్ను ఇరికించారు.. నా కుమారుడిపై ఇప్పటికే అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు..
Read Also: AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం.. ఎల్లుండి నుంచి సమ్మె..
అయితే, నేను, నా భార్య పిల్లలతో వస్తాను.. చంద్రబాబు కూడా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చి నేను తప్పు చేశాడని చెబితే నేను ఏ శిక్షకైనా సిద్ధం.. ఇది నా సవాల్ అన్నారు జోగి రమేష్.. బలహీన వర్గాలు అంటే అంతా అలుసా? చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. రిమాండ్ రిపోర్ట్ లో నా పేరు లేదు.. రిమాండ్ లో ఉన్న వ్యక్తితో వీడియో రిలీజ్ చేయించారు.. జనార్ధన్ పిల్లలను వేధించి ఇబ్బంది పెట్టి బయపెట్టి నా పేరు చెప్పించారని ఆరోపించారు.. ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తోంది.. ప్రభుత్వ తప్పులను నిలదీస్తే తప్పుడు కేసులో నన్ను ఇరికించారు.. కేసులు పెట్టినా ప్రభుత్వ తప్పులను నిలదీస్తా అని ప్రకటించారు.. నా అరెస్ట్ మీ క్షణికానందం మాత్రమే.. కేసు పెట్టినంత మాత్రాన నేను పారిపోను ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశారు.
అక్రమ మద్యం మేం పట్టుకుంటే మేం ప్రశ్నించాం.. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు.. రెండు మూడు నెలలు జైల్లో పెడితే భయపడను.. దమ్ముంటే నేరుగా వచ్చి రాజకీయం చేయండి అని సవాల్ చేశారు జోగి రమేష్.. ఇప్పటికీ నాలుగు కేసులు పెట్టారు.. త్వరలో మీ బట్టలు ఊడ దీస్తా అని హెచ్చరించారు.. నేను సత్యశోధన పరీక్షకు రెడీ.. చంద్రబాబు, లోకేష్, కిలారు రాజేష్ సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు.. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను, ఎక్కడికి పారిపోను.. తిరుమల రాకపోయినా.. బెజవాడ దుర్గమ్మ ఆలయానికి అయినా రండి ప్రమాణం చేద్దాం అన్నారు.. జోగి రమేష్ తప్పు చేయలేదని టీడీపీలో ఉన్న మా రక్త సంబందీకులుగా ఉన్న అనగాని, కొనకళ్ల, గౌతు శిరీష, పితాని చెప్పాలన్న ఆయన.. లేకపోతే కనీసం ప్రమాణం చేయటం కోసమైనా రమ్మని చంద్రబాబుకి చెప్పండి అన్నారు.
జనార్ధన్ అరెస్టైన రోజున వేసుకున్న షర్టుతోనే వీడియో రిలీజ్ చేశారు.. జనార్ధన్ తో నేను ఎప్పుడూ ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు జోగి రమేష్.. నాకు జనార్ధన్ కు ఎటువంటి లావాదేవీలు జరగలేదన్న ఆయన.. జనార్ధన్ తాత మేం ఒకే బజారులో గతంలో ఉండేవాళ్లం.. మా ఇంటి దగ్గర వరకు వచ్చి ఉండచ్చు.. నాకోసం చాలా మంది పనుల కోసం వస్తుంటారు అన్నారు.. అయితే, నన్ను కేసులోకి లాగుతాడు అని నేను విశాఖలో ముందే చెప్పాను అని గుర్తు చేశారు.. చంద్రబాబు ఓ దుర్మార్గుడు.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజక వర్గంలో ఉన్న అన్ని దోచేస్తున్నాడు.. వసంత అతని బావమరిది బూడిద, ఇసుకలో అన్నీ దోచేశాడు.. అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జోగి రమేష్..
