NTV Telugu Site icon

YS Jagan: రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయి..

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం.. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చాం అన్నారు. సాకులు వెతుక్కోకుండా మేనిఫెస్టోను అమలు చేశాం.. ఎప్పుడూ చూడని కోవిడ్ లాంటి సంక్షోభాన్ని రెండేళ్లపాటు ఎదుర్కున్నాం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదు.. ఈ కారణాలు చెప్పి, మేనిఫెస్టో అమలును వాయిదా వేయొచ్చని చాలా మంది సలహా ఇచ్చారు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read Also: Priyanka Mohan: తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ ప్రియాంక మోహన్

ఇక, ఇచ్చిన మాట 30 ఏళ్ల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందుకనే మాట తప్పకుండా హామీలు నెరవేర్చాం.. సమస్యలు, సాకులు చెప్పి తప్పించుకోలేదు.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్‌కు ముందే సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేశాం.. ఆ తేదీకల్లా బటన్‌ నొక్కాం అన్నారు. అలాంటి పాలన మనం అందించాం.. రాష్ట్ర చరిత్రలో, దేశచరిత్రలో లేని విధంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టలేదు.. ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ తోనే నడిపిస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.