AP Constable Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఈ రోజు ఫలితాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా.. ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టినట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం..
Read Also: AP Aqua Farming: ట్రంప్ ఎఫెక్ట్.. ఆక్వా రంగంపై పిడుగు..!
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నాం అని వివరించారు.. మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారు.. ఫైనల్స్ కి 33,921 మంది అర్హత పొందారని పేర్కొన్నారు.. ఇక, సెలక్ట్ అయిన అభ్యర్ధులకు ట్రైనింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తాం.. 9 నెలల్లో వారికి పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు.. ఇక, విశాఖపట్నానికి చెందిన గండి నానాజీ మొదటి స్థానంలో నిలవగా.. విజయనగరానికి చెందిన రమ్య మాధురి రెండో స్థానంలో ఉన్నారు.. రాజమండ్రికి చెందిన అచ్యుత రావు మూడో స్థానంలో నిలిచారు.. ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు ఆన్‌లైన్‌లో పెట్టగా.. www.slprb.ap.gov.inలో అందుబాటులో ఉంచారు.
