Site icon NTV Telugu

Nara Lokesh: ఏసీబీ కోర్టులో నారా లోకేష్ పిటిషన్ పై విచారణ..

Lokesh

Lokesh

విజయవాడ ఏసీబీ కోర్టులో రెడ్ బుక్ అంశంలో నారా లోకేశ్ పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. లోకేశ్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ అంశం ప్రస్తావనకు తెస్తుండడం పట్ల.. సీఐడీ గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐడీ తెలిపింది. ఈ క్రమంలో.. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై డిసెంబరు 28న విచారణ జరగగా.. జనవరి 9కి వాయిదా పడింది.

Read Also: Varla Ramaiah: జగన్ తన పార్టీని ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా నడుపుతున్నాడు..

ఈ క్రమంలో నేడు విచారణ జరిపారు. వాట్సాప్ ద్వారా లోకేశ్ కు నోటీసులు పంపినట్టు సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్ట్ ద్వారా పంపిస్తే అందుబాటులో లేరని, ఆ నోటీసులు రిటర్న్ అయినట్టు సీఐడి కోర్టుుకు తెలిపింది. దాంతో.. కోర్టు ద్వారా నోటీసులు పంపుతామని ఏసీబీ కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.

Read Also: Viral Video: గోవాలో మాజీ మంత్రి మల్లారెడ్డి విన్యాసాలు .. దుబాయ్ లో చిల్ అవుతున్న తలసాని..

Exit mobile version