NTV Telugu Site icon

Vijayawada Floods: కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు

Boats

Boats

Vijayawada Floods: విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల చేస్తున్న 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. 2009లో వచ్చిన వరద వికృతి కంటే అదనంగా వరద వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: Manipur : మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి

ఇక, కృష్ణమ్మకు వరద పోటుతో బోట్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వరద ప్రవాహంలో బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజీ గేట్ కు ఓ బోటు ఢీకొట్టింది. బోటు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డామేజ్ అయింది. ప్రకాశం బ్యారేజ్ వైపు మరో నాలుగు బూట్లు కొట్టుకొచ్చాయి. ఇక, మరోవైపు.. రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.25 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లూ కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నీటిని వచ్చినట్టుగానే సముద్రంలోకి వదిలేస్తున్న అధికారులు.. ప్రకాశం బ్యారేజీకి 2009లో 11.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. 2009 నాటి కంటే 15 వేల క్యూసెక్కుల నీరు ఎక్కువగా ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లోస్ వస్తుంది.