NTV Telugu Site icon

Flood Victims in Vijayawada: బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీలకు వరద బాధితుల తాకిడి

Inscurence

Inscurence

Flood Victims in Vijayawada: బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితులు కంపెనీలకు భారీగా చేరుకుంటున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు మాట్లాడుతూ.. వరదల్లో పాడైన వాహనాల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసిన 12 రోజుల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చెబుతోంది అన్నారు. ఒన్ డ్యామేజ్ పాలసీ తీసుకున్న వారికి వరదల్లో నష్టపరిహారం వస్తుంది.. సుమారు విజయవాడ పరిధిలో 10 వేలకు పైగా వాహనాలకు ఇన్స్యూరెన్స్ క్లైయిమ్ కోసం వస్తారని అంచనా వేస్తున్నాం.. వ్యాపారులకు జరిగిన నష్టానికి స్టాక్స్ కి ఇన్స్యూరెన్స్ బట్టి పరిహారం వస్తుంది అని పేర్కొన్నారు.

Read Also: Viral Videos: ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌లు.. భలేగా పట్టారు భయ్యో!

ఇక, ఇన్యూరెన్స్ ప్రీమియం చెల్లించిన పెయింట్స్, రబ్బరు పరిశ్రమ, పెట్రోల్ బంకులు లాంటి అనేక పరిశ్రమలు క్లెయిమ్ చేయటానికి సిద్ధమవుతున్నాయని ఇన్యూరెన్స్ సర్వేయర్ మధుబాబు చెప్పుకొచ్చారు. క్లైయిమ్ కోసం బాధితులు ఇన్యూరెన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు.. కానీ వరద వల్ల నష్టం అంచనా వేయటం సాధ్యం కానీ పరిస్థితులు ఉన్నాయి.. వ్యాపారులకు మిస్ లీనియస్ & షాప్ కీపర్స్ పాలసీ సెక్షన్ 1బీ కింద మాత్రమే క్లెయిమ్ వస్తాయి.. ఫైర్ పాలసీ ఉన్న వారికి కూడా క్లెయిమ్ వర్తిస్తాయని ఆయన సూచించారు.

Show comments