Site icon NTV Telugu

Jogi Ramesh: నాలుగు గంటలుగా పోలీస్ స్టేషన్లోనే జోగి రమేష్.. ఇంట్లో సిట్ సోదాలు!

Vja

Vja

Jogi Ramesh: విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు గంటలుగా వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంభందించి ఏమైనా పత్రాలు ఉన్నాయా అనే కోణంలో సోదాలు చేస్తున్న అధికారులు.. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీమ్ వెళ్లింది. గంటకు పైగా తనిఖీలు కొనసాగుతున్నాయి.

Read Also: Food poisoning: బెంగాల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్..100 మందికి అస్వస్థత..

అయితే, గత నెలలో అద్దేపల్లి జనార్ధన్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడన్న సమాచారంతో అతడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ తో ల్యాప్ టాప్స్ లోని డేటాను కూడా ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. జోగి రమేష్ ఇంటితో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇంటిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. జోగి రమేష్ రెండో కొడుకు జోగి రోహిత్ ని ఎక్సైజ్ కార్యాలయానికి అధికారులు పిలిపించారు. కాసేపట్లో జోగి రోహిత్ ఎక్సెస్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జోగి రోహిత్ ను అధికారులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం తర్వాత జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది.

Exit mobile version