NTV Telugu Site icon

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు.. నేడు అమ్మవారి దర్శనానికి సీఎం, డిప్యూటీ సీఎం..

Kanaka Durga Temple

Kanaka Durga Temple

Kanaka Durga Temple: దసరా శరన్నవరాత్రులు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై 7వ రోజు వైభవంగా సాగుతున్నాయి.. ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.. వేలాదిగా భక్తులు క్యూలైన్లలో అర్ధరాత్రి 2 గంటల నుంచి వస్తున్నారు… హోల్డింగ్ ఏరియాలలో ఉండే భక్తులను విడతల వారీగా క్యూలైన్లలో వదులుతున్నారు పోలీసులు.. ఇవాళ రాత్రి 11 గంటల‌ వరకూ దర్శనం కొనాగుతుంది.. భక్తుల రద్దీని బట్టి మరో అరగంట వరకూ దర్శన సమయం పెంచే అవకాశం ఉంది అంటున్నారు ఆలయ అధికారులు.. ఇక, మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.. రాత్రి నుంచి భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రి కొండ కిందకు చేరుకుంటున్నారు భక్తులు..

Read Also: IND W vs SL W: రెండో విజయంతో టీమిండియా సెమీ-ఫైనల్‌ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందా?

మరోవైపు.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమ్మవారిని దర్శించుకోనున్నారు.. ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ దర్శనం‌ చేసుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌… ఇక, మధ్యాహ్నం 2 గంటల నుంచీ 3 గంటల మధ్యలో కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.. సీఎంతో పాటు సీఎం సెక్యూరిటీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఇవ్వనున్నారు.. మరోవైపు.. సీఎం, డిప్యూటీ సీఎంల రాక కారణంగా సామాన్య భక్తుల దర్శనాన్ని నిలుపుదల ఉండదని.. భక్తులకు యథావిథిగా దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాతే వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు..