NTV Telugu Site icon

Girl Missing Case: డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు.. యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి

Pawan

Pawan

Girl Missing Case: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆరా తీసిన యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి లభించింది.. బెజవాడలో మిస్‌ అయిన యువతి కేసును ఛేదించారు పోలీసులు.. దాదాపు 9 నెలల తరువాత ఆ యువతి ఆచూకీ లభ్యమైంది.. అయితే, తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు భీమవరానికి చెందిన శివ కుమారి.. దీంతో.. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు జనసేనాని.. దీంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆయువతి మిస్సింగ్‌పై ఆరా తీశారు.. దొరికిన క్లూస్ ఆధారంగా.. ఆ యువతి ఎక్కడ ఉందో కనిపెట్టారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అయితే, మిస్‌ అయిన యువతి.. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. ఆ ఇద్దరినీ జమ్మూలో అదుపులోకి తీసుకున్నారు.. జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొచ్చే పనిలో ఉంది స్పెషల్ టీం. ఇక, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నగర పోలీసు కమిషనర్ రామకృష్ణ.. ఇన్‌స్ట్రాగ్రామ్‌ మేసేజ్‌లను ట్రాక్ చేయటం ద్వారా యువతి జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.. దాంతో.. ప్రత్యేక బృందాన్ని జమ్మూకి పంపారు.. రేపు యువతి సహా జమ్మూ నుంచి విజయవాడకు రానుంది పోలీస్ బృందం.