NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047.. సీఎం ఓపికని మెచ్చుకోవాలి..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047 విజన్‌ డాక్యుమెంట్‌ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. విజయవాలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన స్వర్ణాంధ్ర@2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. సైబరాబాద్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలి.. సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నేనేదో అయిపోవాలని కలలు కనలేదు.. నా కలల సారథిగా చంద్రబాబు తప్ప ఎవరూ కనపడలేదన్నారు.. కోట్లాది ప్రజలకు బలంగా మారారు చంద్రబాబు.. నేను పార్టీలో బాగా నలిగిన తరువాత చంద్రబాబు పైన గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యర్ధుల దాడిని తట్టుకుంటూ పని చేయాలి.. 24 గంటల సమయంలో చంద్రబాబు ఎలా బాధ్యతలు నిర్వహిస్తున్నారా? అనిపిస్తుందన్నారు..

Read Also: Priyanka Gandhi: రాజ్యాంగం అంటే సంఘ్‌బుక్‌ కాదు.. సంవిధాన్‌!

ఇక, ఇన్ని బాధ్యతల మధ్యలో 2047 విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం అమోఘం అంటూ చంద్రబాబును ప్రశంసించారు పవన్‌ కల్యాణ్.. ప్రధాని ఆలోచిస్తోంది వికసిత భారత్‌.. వికసిత భారత్ లో భాగమే స్వర్ణాంధ్ర 2047 అన్నారు.. మరోవైపు.. రూల్ ఆఫ్ లా ని అమలు చేయాల్సిందే.. గత ఐదు సంవత్సరాలు చాలా నిర్మాణాలు కూల్చేశారు.. నిర్మాణాత్మకంగా ఆలోచించాల్సి ఉంది.. గోవా లాంటి టూరిస్టు డెస్టినేషన్ కొందరివల్ల నాశనం అయ్యిందన్నారు.. ఏపీని ఒక టూరిస్టు డెస్టినేషన్ లాగా చేయాలి.. టూరిజం వల్ల ఉపాధి అవకాశాలు కూడా అధికంగా వస్తాయన్నారు.. సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలి.. సీఎం చంద్రబాబు నుంచీ నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. గత ఐదేళ్ళలో ఒక్క ఐఏఎస్ అధికారి తప్పును తప్పు అని బలంగా చెపితే వేరేలా ఉండేది.. చాలా గ్రామాల్లో డోలీలు కట్టుకుని గర్భిణీ స్త్రీలను తీసుకెళుతున్నారు.. 254 గ్రామాలకి 3 వేల కోట్లు అవసరం అంటే సీఎం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు.. మనకున్న ఖనిజాలు, నీటి వనరులు ప్రజలకు అందించాలని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..