NTV Telugu Site icon

CM Chandrababu: వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక.. తెల్లవారేలోపు బుడమేరు గండ్లు పూడుస్తాం..

Babu

Babu

CM Chandrababu: వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక అందచేస్తాం.. నష్టం అంచనాలపై నివేదిక రేపు పంపనున్నట్టు వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏరియల్ సర్వే చేశాను.. కొల్లేరు సరస్సు, బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతం చూశాను.. బుడమేరు గండ్లు పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ రోజు రాత్రి కల్లా బుడమేరు గండ్లు పూడుస్తామని వెల్లడించారు.. ఆర్మీ వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి పని చేస్తున్నారు.. ఈ రోజు రాత్రికి పై నుండి బుడమేరుకు వరద రాదని అంచనా ఉంది.. అయినా.. వాటర్‌ ప్లోటింగ్‌లోనూ పనిచేస్తున్నాం అన్నారు.. ఇక, 149 అర్బన్, 30 గ్రామ సచివాలయంలోని పనులు జరుగుతున్నాయి.. శానిటేషన్, వాటర్ వస్తున్నాయా? లేదా అనేదానిపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.. భోజనాలు కూడా బాగున్నాయని ప్రజల నుండి స్పందన వచ్చిందన్నారు. 3 లక్షలకు పైగా ప్యాకెట్ల భోజనం సరఫరా చేశాం.. 7 వేల మంది శానిటేషన్ సిబ్బంది పని చేస్తున్నారు. 110 ఫైర్ ఇంజన్లు పని చేస్తున్నాయి.. 10 వేల ఇళ్లు ఇప్పటి వరకూ క్లిన్ చేశాం. 23 వేల కు పైన ఇళ్ళకూ ఇంక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి.. 680కి పైగా JCB, ఇతర వాహనాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఉచిత బస్సులు తిరుగుతున్నాయి.. సెల్ ఫోన్ టవర్స్ కూడా దాదాపు అన్ని పని చేస్తున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు.. ప్లంబర్స్, మెకానిక్‌లు, ఎలక్ట్రీషన్స్‌ ని కూడా సిద్ధం చేస్తున్నాం.. ప్రతి కుటుంబానికి నిత్యవసర 6 ఐటమ్స్ తో ప్యాకేజీగా ఇస్తున్నాం.. ప్యాకేజీ అన్ని ఇళ్లకు అందే వరకు భోజనాలు సరఫరా చేస్తాం అన్నారు. అంటు వ్యాధుల రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. కూరగాయల మార్కెట్‌లో ఎక్కువకు అమ్ముతున్నారు.. ఈ రోజు40 వేల కేజీల కూరగాయలు పంపిణీ చేశాము.. పిల్లల చదువుకునే పుస్తకాలు కూడా తడిచిపోయాయన్నారు. బుడమేరు గoడ్లను గుర్తించలేని వారు అధికారం వెలగబెట్టారు.. దాని వలన బుడమేరు కు గండ్లు పడ్డాయన్నారు. ఎన్డీఏపై ప్రజలకు నమ్మకం ఉంది.. దానిని మేం నిలబెట్టు కోవాలి.. ప్రస్తుతం ప్రభుత్వం ఖజానా ఖాళీ అయింది. వరద వలన నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం.. రేపు కేంద్రానికి నష్టం అంచనాలపై నివేదిక అందజేస్తాం.. విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా.. మీరు చేయగలిగినంత సాయం చేయాలని అందరినీ కోరుతున్నా.. వ్యాపారులు మరలా నిలదొక్కుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.. నష్టపోయిన వస్తువులు, వాహనాలకు ఇన్స్యూరెన్స్ త్వరగా వచ్చేలా చూస్తున్నాం.. విజయవాడకు భవిష్యత్ లో ముంపునకు గురవ్వకుండ చూస్తాం.. దీనికోసం త్వరలో డీపీఆర్‌ సిద్ధం చేస్తాం అన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సాయం చేసింది అనే వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

Show comments