CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదమే తప్పింది.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విరామం లేకుండా పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎప్పటికప్పుడు.. ఆయా ప్రాంతాల్లోని బాధితులను పరామర్శిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.. అయితే, ఈ రోజు మధురానగర్ రైల్వే ట్రాక్ వద్ద సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద ప్రమాదమే తప్పింది.. వరద పరిస్థితిని చూసేందుకు రైల్వే ట్రాక్ దాటారు సీఎం చంద్రబాబు… అయితే, చంద్రబాబు రైల్వే ట్రాక్ వద్ద ఉండగానే రైలు వచ్చేసింది.. ఇక, రైలును చూసి భద్రతా సిబ్బంది అప్రమత్తం కాగా.. రైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయారు సీఎం చంద్రబాబు. రెయిలింగ్ కు.. రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాపులోనే ఉండిపోయారు ముఖ్యమంత్రి.. ఇక, రైలు వెళ్లిన అనంతరం బయటకు వచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు.. రైలు వెళ్లిపోయిన అనంతరం తన పర్యటనను కొనసాగించారు సీఎం చంద్రబాబు.
Read Also: Bangladesh: “బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు అదే కారణం”: మహ్మద్ యూనస్..