CM Chandrababu: విజయవాడ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తి అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.. RR పేట ఇష్యూ మానవ తప్పిదమన్న ఆయన.. రాజ రాజేశ్వరి పేటలో డయేరియా కట్టడిలో అధికారులు వైఫల్యం చెందారని ఫైర్ అయ్యారు.. అయితే,చ గుంటూరు జిల్లా తురకపాలెం ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.. ఇక, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణంపై పీపీపీ (ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు.. రాజకీయ అంశాలను మేం ఎదుర్కొంటాం.. కానీ, మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Bandi Sanjay : కేటీఆర్ పరువు నష్టం కేసుపై బండి స్పందన.. ఫీజు రీయింబర్స్మెంట్ పై ఫైర్
