NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును ఆశ్రయించారు వంశీ.. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్‌ చేసింది.

Read Also: Hyderabad: దారుణం.. కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన బైక్ రేసర్..

మరోవైపు.. వల్లభనేని వంశీని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు జైలు అధికారులు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో.. ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించినట్లు నమోదైన కేసులో వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13వ తేదీన అరెస్ట్‌ చే వారు విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో నివాసం ఉంటున్న వంశీని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి.. విజయవాడ తీసుకెళ్లిన విషయం విదితమే.. ఇక, కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ తదితర సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేసిన విషయం విదితమే..