Chicken Prices Drop: నాన్‌వెజ్‌ ప్రియులకు నోరూరాల్సిందే.. అమాంతం పడిపోయిన చికెన్‌ ధరలు..!

  • భారీగా తగ్గిన చికెన్ ధరలు..
  • కిలో 100 రూపాయలు తగ్గిన చికెన్ ధర..
  • గత వారం కిలో 400 పలికిన చికెన్ ధర..
  • వారం తర్వాత చికెన్ ధరల్లో భారీ వ్యత్యాసం
Chicken Price

Chicken Price

Chicken Prices Drop: నాన్‌వెజ్‌ ప్రియులకు నోరూరించే వార్త.. క్రమంగా కొండెక్కిన చికెన్‌ ధరలు.. ఎట్టకేలకు దిగివచ్చా యి. ఈ నెల ప్రారంభంలో కిలో చికెన్ ధర గతంలో లేని విధంగా రూ.360 నుంచి 400 రూపాయల వరకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో కోళ్లు చనిపోవడంతో కోళ్లు తగ్గి ధర పెరిగింది. రెండు వారాల క్రితం 360 రూపాయలు పలికిన చికెన్ కిలో ధర గత నెలలో ఆల్ టైం రికార్డు ధరకు కిలో 400 రూపాయలకు చేరుకుంది. ఇంత ధరకు చేరుకోవడంతో చికెన్ కొనుగోళ్లు కూడా బాగా తగ్గిపోయాయని వ్యాపారులు వాపోయారు. అయితే, వారం తర్వత ఇవాళ కిలో చికెన్ ధర 100 రూపాయలు తగ్గి 300కి దిగివచ్చింది.. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇపుడు చికెన్ ధర తగ్గటంతో మళ్లీ అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Read Also: Indigo Emergency: జస్ట్ మిస్.. ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం