Site icon NTV Telugu

BV Raghavulu: వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలి.. మెడికల్‌ కాలేజీలపై క్లారిటీ ఇవ్వండి..!

Bv Raghavulu Cpm

Bv Raghavulu Cpm

BV Raghavulu: కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నోటితో నవ్వడం.. నోసటితో ఎగతాళి చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో విద్వేషాలు, విభజనలు సృష్టించడం బీజేపీ పని అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీకి ఊతామి ఇస్తున్నాయని, ప్రజల్ని బ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు. బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడమే టీడీపీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు.. చంద్రబాబు కంటే లోకేష్‌ ఎక్కువగా మాట్లాడుతున్నాడని అన్నారు రాఘవులు..

Read Also: Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఋషికొండ భవనాలపై కూడా బీవీ రాఘవులు సూటిగా స్పందించారు.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సైన్స్, ఆర్ట్, హెరిటేజ్ మ్యూజియంలా మార్చాలని.. పిల్లల కోసం జూ, బోటానికల్ గార్డెన్ ఏర్పాటుచేయాలని సూచించారు.. కానీ, కళ్యాణ మండపంలా అద్దెకు ఇవ్వాలన్న కూటమి ఆలోచన దారుణమని అన్నారు. మెడికల్‌ కాలేజీల వివాదంపై స్పందిస్తూ.. అసలు, పీపీపీ, ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని స్పష్టం చేశారు రాఘవులు.. ల్యాండ్ పూలింగ్ రైతుల అంగీకారంతోనే జరగాలని, 2013 చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. రెండో దశ పూలింగ్‌కు సీపీఎం వ్యతిరేకమని పేర్కొన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..

Exit mobile version