NTV Telugu Site icon

Festival Rush: బెజవాడలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వే స్టేషన్..

Vijayawada Rush

Vijayawada Rush

దసరా పండుగ సందర్భంగా విజయవాడ సందడిగా మారింది. రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. రాష్ట్రం నుంచి తమ సొంతూర్లకు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. దీంతో.. బెజవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. పండుగ సెలవుల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే 640 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ మీదుగా విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, ఒరిస్సా వెళ్లే ప్రయాణికుల తాకిడితో బెజవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ప్రధానంగా.. అనకాపల్లి. శ్రీకాకుళం. విశాఖ ప్రాంతాల నుంచి భవానీ భక్తులు దుర్గమ్మను దర్శించుకోవడానికి రావటంతో రద్దీ నెలకొంది.

Read Also: Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..

దసరా పండుగ సెలవుల నేపథ్యంలో బెజవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిట లాడుతోంది. ఇప్పటికే పండుగ సందర్భంగా మూడు వేలకు పైగా ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో రోజు మీద అధిక సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు బస్టాండ్ మీద జరుగుతున్నాయి.

Read Also: TGPSC: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్..