Pawan Kalyan: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపటితో ఈ పుస్తక మహోత్సవం ముగియనుండగా.. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు ఉదయమే పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉదయం 2 గంటల పాటు పవన్ కల్యాణ్ కోసం స్టాళ్లను తెరిచి ఉంచాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేవలం పవన్ కల్యాణ్ కోసం కొన్ని స్టాళ్లు ఆయన అడిగినవి తెరిచి ఉంచారు.. పవన్ కల్యాణ్ ఆయా స్టాళ్లను సందర్శిస్తూ.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం కూడా కొనుగోలు చేశారు..
Read Also: Costly Catch: ఒంటి చేత్తో క్యాచ్ పట్టి.. రూ.90 లక్షలు పట్టుకెళ్లిన ప్రేక్షకుడు
కల్యాణి పబ్లికేషన్స్, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించిన పవన్ కల్యాణ్.. చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు.. ఇక, ఆ తర్వాత కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఈ పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదనపడతానని.. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..