PVN Madhav: రాజధాని అమరావతి అభివృద్ది చెందాలన్నదే బీజేపీ అభిమతం అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.. గత ప్రభుత్వం అమరావతి రైతులను దగా చేసిందని విమర్శించారు… ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతి రైతులకు బీజేపీపై ఉన్న అపోహను రాజధాని జేఏసీ నేతల సమావేశంలో తీర్చేశామన్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన సమయంలోనే బీజేపీ.. అమరావతికి కట్టుబడి ఉందని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం ప్రకటించాలని రాజధాని జేఏసీ నేతలు కోరారన్నారు. పదకొండేళ్లక్రితం రాజధానికోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకూ అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు మాధవ్.. అయితే, డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ది సాధ్యమని చెబుతూనే అమరావతి కోసం కేంద్రం 15 వేల కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం 3 వేల కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..
Read Also: TG Vishwaprasad: సినీ పరిశ్రమ ఒక మాఫియాలా అవినీతికి అడ్డాగా మారింది
