Site icon NTV Telugu

Big Relief To MP Mithun Reddy: ఎంపీ మిథున్‌ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి..!

Mp Mithun Reddy

Mp Mithun Reddy

Big Relief To MP Mithun Reddy: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. న్యూయార్క్‌ వెళ్లేందుకు మిథున్‌ రెడ్డికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏ 4గా ఉన్న మిథున్ రెడ్డి.. బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. 50,000 రూపాయల విలువచేసే రెండు జమీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక, న్యూయార్క్ లో ఎక్కడ బస చేస్తున్నారు అనే వివరాలను కోర్టుకు అందజేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..

Read Also: Vijayawada: విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వ చర్చలు.. కీలక నిర్ణయాలపై దృష్టి!

కాగా, ఏపీ లిక్కర్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. అమెరికాలోని న్యూయార్క్‌ పర్యటనకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. దీంతో, ఈ పిటిషన్‌పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.. దానికి అనుగుణంగా ఈ రోజు ఎంపీ మిథున్‌ రెడ్డికి ఊరట కల్పిస్తూ.. న్యూయార్క్‌ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. అయితే అక్టోబర్ 26వ తేదీన అమెరికా వెళ్లనున్న పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఉన్న విషయం తెలిసిందే..

Exit mobile version