NTV Telugu Site icon

Bhavani Deeksha Viramana: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీలు.. దీక్షల విరమణ ప్రారంభం..

Bhavani Deeksha Viramana

Bhavani Deeksha Viramana

Bhavani Deeksha Viramana: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి.. దీంతో సుమారు రోజుకి 50 వేలకు మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నారు అధికారులు.. 7 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ ఇచ్చిన తర్వాత అంటే ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు.. ఇక, భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు..

Read Also: TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల..? నేడు సభలో చర్చ..

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుండి భవాని దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయి.. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు భవాని దీక్ష విరమణలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం అన్నారు సీపీ రాజశేఖర్‌బాబు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఏడాది 7 లక్షల పై చీలుక భవానీలు వస్తారని అంచనా వేస్తున్నాం.. భవానీలు మాల విరమణ కోసం రెండు హోమగుండాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు.. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మానిటర్ చేస్తున్నాం.. సుమారుగా 1900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.. భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన.. కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మోనిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నాం అన్నారు.. భవానీ దీక్ష విరమణ సంబంధించి సంయుక్తంగా ఏర్పాట్లు చేశాం.. కమాండ్ కంట్రోల్స్ ద్వారా సాంకేతికంగా ముందుకు పోతున్నాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ తేలికగా మారింది.. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థని పటిష్టం చేశామని తెలిపారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.

Show comments