NTV Telugu Site icon

Durga Temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆషాఢ సారె మహోత్సవం..

Vja

Vja

ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు తెలిపారు. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తరువాత శాఖంబరీ ఉత్సవాలకు కావాల్సిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారు.. జులై 19, 20వ తేదీలలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆషాఢ సరే మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది.. కదంబం ప్రసాదంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు.

Read Also: Food Poison : శ్రీ చైతన్య రెసిడెన్సీ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 70 మంది విద్యార్థినిలకు అస్వస్థత..

ఇక, వారాహి నవరాత్రులు వస్తున్నాయి.. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతామని ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో రామారావు చెప్పుకొచ్చారు. జులై 6 నుంచి 15 వరకూ వారాహి నవరాత్రులు కొనసాగనున్నాయి. 14వ తేదీన మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు.. కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాటు చేస్తున్నాం.. జులై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగరం మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందన్నారు. నిన్న మల్లేశ్వరస్వామి వారికి బంగారు తాపడం చేసిన కవచం, నాగాభరణం, మకరతోరణం, పీఠం దాతలు ఇచ్చారు అని ఆలయ ఈవో పేర్కొన్నారు.

Read Also: Revanth Reddy : డి శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్..

అయితే, కనకదుర్గమ్మ ఉన్న ఇంద్రకీలాద్రిపై సనాతనంగా ఉన్న శివలింగం స్వరణమయం అయింది అని ఈవో రామారావు చెప్పారు. అత్యంత పురాతన ఆలయం పూర్తిగా అభివృద్ధి జరిగింది.. మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటారు.. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామన్నారు. 11:45 నుంచి 12:15 వరకూ మహా నివేదన ఉంటుంది.. 11:30 నుంచి 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు.. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.