53 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ‘అర్నబ్’ తుఫాన్ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 2026, అక్టోబర్ 28, 2026 తేదీల్లో అంటే రెండు రోజుల పాటు నడవాల్సిన మొత్తం 53 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ కోస్టల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలపై ప్రభావం చూపనుంది. విజయవాడ (BZA), విశాఖపట్నం (VSKP), రాజమండ్రి (RJY), మచిలీపట్నం (MTM), గుడివాడ (GDV), భీమవరం (BVRM), నరసాపురం (NS), గుంటూరు (GNT), కాకినాడ పోర్ట్ (COA) మధ్య నడిచే స్థానిక, ప్యాసింజర్ రైళ్లు రద్దయిన వాటిలో ఉన్నాయి.
ముఖ్యంగా విజయవాడ–మచిలీపట్నం మార్గంలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లు (67263, 67264, 67265, 67266, 67267, 67268, 67269, 67270) తో పాటు మచిలీపట్నం–గుడివాడ (67271, 67272, 67252, 67253, 67254, 67255) రైళ్లు రద్దయ్యాయి. అలాగే విజయవాడ–రాజమండ్రి (67261, 67202, 67262), విజయవాడ–నరసాపూర్ (67258, 67257, 17269, 17270, 67276), విజయవాడ–భీమవరం (67275, 67281, 67282), భీమవరం–నిడదవోలు (67277, 67278, 67283, 67284), నరసాపూర్–నిడదవోలు (67244, 67245), నరసాపూర్–రాజమండ్రి (67246) మరియు నరసాపూర్–భీమవరం (17264) సర్వీసులను కూడా నిలిపివేశారు.
ఇక గుంటూరు, రేపల్లె, తెనాలి పరిసరాల్లో రాకపోకలు సాగించే నరసాపూర్–గుంటూరు (67247), గుంటూరు–విజయవాడ (67248), విజయవాడ–గుంటూరు (67229), గుంటూరు–రేపల్లె (67249, 67223), రేపల్లె–గుంటూరు (67250), రేపల్లె–తెనాలి (67224), తెనాలి–విజయవాడ (67222) రైళ్లు రద్దయిన జాబితాలో ఉన్నాయి. తీర ప్రాంతాలైన విజయవాడ–కాకినాడ పోర్ట్ (17257, 17258), కాకినాడ పోర్ట్–రాజమండ్రి (67301, 67302), కాకినాడ పోర్ట్–విశాఖపట్నం (17267, 17268), రాజమండ్రి–విశాఖపట్నం (67285, 67286) తో పాటు పార్వతీపురం–విశాఖపట్నం (07267, 07268) ప్రత్యేక రైళ్ల రాకపోకలను సైతం రద్దు చేశారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రయాణికులు రైల్వే సమాచారాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో రైళ్ల రాకపోకల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సంబంధిత రైలు సర్వీసు స్థితిని అధికారిక రైల్వే సమాచార మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

