Site icon NTV Telugu

ACB Trap: ఏసీబీ చరిత్రలోనే తొలిసారి..! రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఎన్సీ..

Acb Trap

Acb Trap

ACB Trap: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడని విధంగా ఏకంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ఓ అధికారి.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.. భీమవరానికి చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి 35 కోట్ల రూపాయల బిల్లు విడుదల చేయాల్సి ఉండగా.. దాని కోసం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌.. అయితే, ఇవాళ 25 లక్షల రూపాయాలు అడ్వాన్స్ ఇవ్వగా.. ఆ డబ్బు ఇస్తుండగా శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేయడం.. రూ.25 లక్షలతో పట్టుబడడం ఇదే తొలిసారి అంటున్నారు ఏసీబీ అధికారులు..

Read Also: Komatireddy: ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నాకు రాహుల్, ఖర్గే డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..

Exit mobile version