Site icon NTV Telugu

AP Power Staff JAC: విద్యుత్ జేఏసీ చర్చలు విఫలం.. పోరుబాటలో విద్యుత్‌ ఉద్యోగులు

Ap Power Staff Jac

Ap Power Staff Jac

AP Power Staff JAC: విద్యుత్‌ యాజమాన్యాలతో విద్యుత్‌ JAC నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. దీంతో, పోరుబాటలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విద్యుత్‌ ఉద్యోగులు.. 13వ తేదీన ఛలో విజయవాడ, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.. అయితే, సంవత్సరం నుంచి సాగుతున్న చర్చలు ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.. యాజమాన్యం కాలయాపన చేస్తోందని, సమస్యల పరిష్కారం వైపు రావడం లేదని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మొండి వైఖరి ఆపాలి.. ఛలో విజయవాడ సమ్మె తప్పదంటున్నారు విద్యుత్ ఉద్యోగులు.

Read Also: Strike Postponed: అప్పటివరకు ఉన్నత విద్యా సంస్థల సమ్మె వాయిదా..

ఇక, డిమాండ్‌ విషయానికి వస్తే.. కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, ఎనర్జీ అసిస్టెంట్, డీఏ పెంపు లాంటి కీలక డిమాండ్లు ఉన్నాయి.. గత చర్చల్లో ఇచ్చిన హామీలను ఆర్డర్ రూపంలో ఇవ్వలేదని అంటున్నారు జేఏసీ నేతలు.. 50 వేల కుటుంబాలు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది.. 45 రోజులుగా ఆందోళనలో 27 వేల కాంట్రాక్ట్, 35 వేల పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు.. యాజమాన్యం చర్చల పేరుతో సమయం వృథా చేస్తుందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.. ఎనర్జీ సెక్రటరీ స్వయంగా చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.. కాంట్రాక్ట్ కార్మికులు 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తెలంగాణలో పర్మినెంట్ చేసినట్టే ఏపీలోనూ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 ఏళ్లు పనిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని.. నారా లోకేష్, పవన్‌ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు జేఏసీ నేతలు..

Exit mobile version