NTV Telugu Site icon

Minister Nara Lokesh: మా హయాంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం..

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్‌.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.. ఏపీలో ఉద్యోగ కల్పన చాలా అవసరం… ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు.. వ్యవసాయం, MSME రంగాలకు ఏపీ ఒక కేంద్రంగా ఉంది.. చంద్రబాబు సీఎం అయిన ప్రతీసారీ కొత్తగా ముందుకెళుతున్నారు.. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు చంద్రబాబు మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా అభివర్ణించారు.

Read Also: MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..

ఏపీలో మానవ వనరులు కంపెనీల అవసరాలకు తగినట్టుగా సిద్ధంగా ఉన్నాయి అన్నారు మంత్రి నారా లోకేష్‌.. ఏపీలో యువత చాలామంది ఉన్నారు.. కేజీ టూ పీజీ యువతకు ఉపాధి ఇచ్చే నాలెడ్జ్ పెంచడం మా ధ్యేయం.. రాబోయే ఆరు నెలల్లో డేటా సెంటర్లు వంటివి చాలా వస్తాయి… ఐటీ, డేటా సెంటర్లు, ఏఐలతో విశాఖ పూర్తిస్ధాయిలో అభివృద్ది వైపు వెళ్తుందన్నారు.. నీరు, ఎన్సెంటివ్స్ లాంటి వాటిలో గత ఐదేళ్లలో ఇబ్బందులు వచ్చాయి.. యువ ఐఏఎస్ అధికారికి ప్రత్యేకంగా పారిశ్రామికాభివృద్ధి విషయంలో బాధ్యతలు ఇచ్చాం అన్నారు.. ఇక, సీఈవోల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇస్తూ.. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, వ్యవసాయంలోకి డిజిటల్ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నాం.. సాంకేతికత ద్వారా వ్యవసాయానికి ఖర్చు తగ్గిస్తాం.. ఏపీలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ను తీసుకొస్తాం.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వానికి సమావేశాలకు ఒకే కామన్ పాయింట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు.. కేరళ మాదిరిగా రెండు నెలలకు ఒకసారి పరిశ్రమలతో సమావేశంపై మిగిలిన మంత్రులతో మాట్లాడి త్వరలో నిర్ణయిస్తాం అన్నారు.. పరిశ్రమల ఏర్పాటుకు ఒక ప్రత్యేక ఎకో సిస్టం ఉండాలన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పీపీఏల రద్దు ఏపీకే కాదు దేశానికే ఇబ్బంది కలిగించింది అన్నారు..

Read Also: MP Sudha Murty: క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..

ఏపీ మహిళలు పారిశ్రామిక వేత్తలు కావాలి అని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్‌.. అగ్రి బయోటెక్ క్లష్టర్ కు మా ప్రాధాన్యత ఉంటుంది.. ప్రతీ మహిళకు ఇంటి నుంచే ప్రోత్సాహం మొదలవ్వాలన్నారు.. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మా ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీలో అగ్రి బయోటెక్ క్లష్టర్ ఏర్పాటు పై ఆలోచించాలని సూచించిన భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా లెల్లా సూచించారు..