AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అతడు మద్యం అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడని సీఐడీ విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర సర్కార్ అనుమతితో సీఐడీ, ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆస్తుల జప్తు కోసం పిటిషన్ దాఖలు చేయబోతుంది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని నిర్ణయించింది.
Read Also: Bharti Singh : మీద పడేవారు.. టచ్ చేసేవారు – కమెడియన్ భారతి షాకింగ్ కామెంట్స్
అయితే, సీఐడీ అధికారులు తెలిపినట్లు.. ఈ ఆస్తులు అన్నీ అక్రమ ఆదాయంతోనే సంపాదించినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వని తెలిపింది.. చట్టప్రకారం విచారణ కొనసాగుతుందని తెలిపింది. తాజా పరిణామాలతో లిక్కర్ స్కాం కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
