Boycott Swiggy in AP: బాయ్‌కాట్ స్విగ్గీ..! హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం..
- స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని నిర్ణయం..
- నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం..
- ఈ నెల 14వ తేదీ నుంచి ఏపీలో స్విగ్గీ బాయ్ కాట్ అంటూ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boycott Swiggy in AP: ఇప్పుడు అంతా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్‌పై ఆధారపడుతున్నారు.. నచ్చిన రెస్టారెంట్ నుంచి.. మెచ్చిన ఫుడ్ అలా ఆర్డర్ చేసి.. ఇలా నిమిషాల్లో అందుకుంటున్నారు.. అయితే, దీని వెనుక పెద్ద ప్రాససే ఉంటుంది.. ఇప్పుడు హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు.. స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు.. అయితే, నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలివేశామని ప్రకటించారు.. రాష్ట్రంలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం అంటూ స్పష్టం చేశారు..
Read Also: Minister Tummala: మరో 20 లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ..
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ఇక, స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది హోటల్స్ అసోసియేషన్.. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27న మూడు దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించాం.. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించింది.. కానీ, స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందని మండిపడ్డారు.. దీంతో, అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం.. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయంపై చర్చించామన్నారు.. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈనెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం అని ప్రకటించారు.. అయితే, స్విగ్గీ, జొమాటోకు సహకరించేందుకు మేం సిద్దంగానే ఉన్నాం.. కానీ, నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.. క్రేజీ ప్యాకేజీల పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకు విక్రయాలతో మేం నష్టపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు.
తాజావార్తలు
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!