NTV Telugu Site icon

Flood Relief Compensation: విజయవాడ వరద బాధితులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో నగదు జమ

Flood Relief Compensation

Flood Relief Compensation

Flood Relief Compensation: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానది ఉగ్రరూపం.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ సిటీ అతలాకుతలం అయ్యింది.. ఎన్నడూ చూడనంత నష్టాన్ని చూసింది.. అయితే, యుద్ధప్రతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఓవైపు బాధితులను ఆదుకుంటూనే.. ఇంకో వైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకుంది.. ఇక, క్రమంగా బెజవాడ కోలుకున్న తర్వాత.. వరద నష్టాన్ని అంచనా వేసింది.. ఇప్పుడు విజయవాడ వరద బాధితిలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఇప్పటికే వరద బాధితులకు పరిహానం ప్రకటించిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 1,501 మంది బాధితుల కోసం రూ.2.5 కోట్లు పరిహారం విడుదల చేసింది.. 1,501 మంది బాధితులకు వారి అకౌంట్లకు నేడు నగదు బదిలీ చేసింది..

Read Also: OTT Movies : టీవీ ప్రేక్షకులకు పండగే.. ఓటీటీల్లోకి ఒక్క రోజే 23సినిమాలు

అయితే, ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ గా ఉండడం వల్ల 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు.. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారం అందించనున్నారు అధికారులు.. బ్యాంకు అకౌంట్లు అందుబాటులో లేని మరో 256 మంది అర్హుల వివరాలను ఆయా సచివాలయాలు, ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా వెల్లడించనుంది ప్రభుత్వం.. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు వెల్లడించారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.. పరిహారం అందజేతపై తాజా వివరాలు సీఎంవోకు తెలిపారు జిల్లా అధికారులు.

Read Also: 35 Chinna Katha Kaadu: 384 ఎంట్రీలలో ఒకటి.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంకు అరుదైన ఘనత!

సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశారు.. ముందుగా రూ.602 కోట్లు.. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9 వేల మందికి మరో రూ.16 కోట్లు చెల్లించారు.. మళ్లీ కొత్తగా 2,954 దరఖాస్తులు రాగా.. అందులో 1,646 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామని.. తాజాగా సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు.. ఇక, ఈ రోజు 1,501 మంది బాధితుల కోసం రూ.2.5 కోట్ల పరిహారం విడుదల చేసింది ప్రభుత్వం..