NTV Telugu Site icon

CM Chandrababu: భవిష్యత్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: సీ ప్లేన్ ప్రయాణం వినూత్నమైనది.. మన రాష్ట్రానికి టూరిజం ఒక వరం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లోని పున్నమీ ఘాట్‌లో సీప్లేన్‌ పర్యాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం.. పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించారు. అయితే, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను నాలుగు సార్లు సీఎంను.. కానీ, గత మూడు సార్లు ఎప్పుడూ ఇంత కష్టపడలేదు.. విధ్వంసం చేసిన వ్యవస్థను చక్కబెడుతున్నాను.. గాడితప్పిన పాలనను గాడిలో పెడతాం అన్నారు.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్‌ ఇచ్చారు.. మళ్లీ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా మార్చే వరకు నిద్రపోకుండా పనిచేస్తాను అని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇక, తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్‌ నాయుడు అంటూ ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం. రాష్ట్రానికి టూరిజం ఒక వరంగా పేర్కొన్న ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచాలి అనేది మా విధానంగా స్పష్టం చేశారు.. భవిష్యత్‌ అంతా పర్యాటకానిదే అన్నారు.. భవిష్యత్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్‌’ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుందన్నారు.. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దానిని పూర్తిగా వినియోగించుకోవాలి. ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారు. అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్‌ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందని వెల్లడించారు.. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు గెలిపించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పని చేస్తామని స్పష్టం చేశారు..

Read Also: AP Nominated Posts: నామినేటేడ్ పోస్టులు భర్తీ.. రెండో జాబితాలో 59 మందికి పదవులు.. లిస్ట్‌ ఇదే..

నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను. కానీ, గత మూడు సార్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదన్న సీఎం చంద్రబాబు.. ఈ సారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టటానికి చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేది లేదు. గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోను అన్నారు.. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలనేదే ఆలోచిస్తున్నాం. గాడితప్పిన పరిపాలనను సరిచేయడమే నా లక్ష్యం. ఏపీలోని రోడ్లను చూసి అవహేళన చేశారు. పొగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏపీ సీఎం ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments