Chandrababu: మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు.. విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు పవన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీతో త్రివిధ దళాలకు మద్దతు తెలిపింది కూటమి ప్రభుత్వం.. జాతీయ జెండాలు చేతబట్టి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ ర్యాలికి నాతో వచ్చారు.. 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్రకి ప్రజలే శ్రీకారం చుట్టారు.. ఇది ప్రజా ఉద్యమం.. ఉగ్రవాదంపై పోరాడిన సైనికులకు సెల్యూట్ అన్నారు..
Read Also: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్..
జాతీయ జెండా చూడగానే అత్యంత ఉత్సాహం.. జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య కృష్ణాజిల్లాకి చెందిన వారే అని గుర్తుచేశారు చంద్రబాబు.. గుర్తింపు కలిగిన ఏకైక జెండా భారతీయ జెండా.. పెహల్గామ్ అనగానే మనం ఖబడ్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తాం.. ప్రధాని మోడీ ఆడబిడ్డల నుదుట తిలకం తీసేసిన ఉగ్రవాది ఉండకూడదని ఆపరేషన్ సిందూర్ చేపట్టారు.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది ఉగ్రవాదం.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అన్నారు.. జాతీయ జెండా కట్టుకుని మరణించిన అమరజీవి మురళీ నాయక్.. మురళీ నాయక్ అమర్ రహే.. అంటూ నినాదాలు చేశారు.. బోర్డర్‌లో మన సైనికులు పోరాడుతున్నారు.. మనం మద్దతిస్తున్నాం అన్నారు.. ప్రధాని మోడీ సంకల్పం ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడ దక్కున్నా అంతమొందించడం అని స్పష్టం చేశారు.. ప్రతీ ఒక్కరూ అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవ్వాలి.. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే నాయకుడు నరేంద్ర మోడీయే అన్నారు.. 2045 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా భారతదేశం అవుతుంది.. భారతదేశం నంబర్ 1 అవ్వాలంటే.. అందరం కలిసి పని చేయాలి.. జాతి పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.. ఆపరేషన్ సిందూర్ లాంటి కార్యక్రమాలు చాలా అవసరం.. ప్రపంచ ఉగ్రవాదులు అందరూ ఆపరేషన్ సిందూర్‌ను గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
