CM Chandrababu: ఈ రోజు చరిత్రలో గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన బీఎస్‌ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందన్నారు.. ఇక, ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారన్నారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని.. సరైన సమయంలో, సరైన వ్యక్తి, సరైన ప్రాంతంలో మోడీ ఉన్నారని అభినందించారు.. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు ఐటీ వెన్నెముకగా ఉండేది.. అలాంటి సమయంలో అమెరికాలో తిరిగి రాష్ట్రానికి ఐటీ వచ్చేలా కస్టపడి పని చేశాను.. బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినప్పుడు రాజకీయ నాయకులతో పని లేదని అన్నారు.. వారం రోజులు పవర్ ప్రజెంటేషన్ తయారీ చేసి ఇచ్చాను.. ఐటీ టెక్నాలజీ లో అనేక మార్పులతో అభివృద్ధి చేశాం.. అలాగే టెలికం రంగంలో మార్పులు తీసుకురావటానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేసుకున్నారు..
Read Also: LENIN : అయ్యగారి ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక, ధరలు తగ్గించాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రధానులతో చర్చించాను.. ఆ తరువాత వాజ్‌పైకి తెలియచేస్తే BSNLతో సరి కొత్త నిర్ణయాలతో ముందుకి వెళ్లగలిగాం అన్నారు చంద్రబాబు.. ఆనాడు BSNL దెబ్బతింటుందని అందరు అనుకున్నారు.. కానీ, ఒక శక్తి వంతమైనదిగా ఎదిగింది.. గతంలో పెద్ద పెద్ద ప్రోడక్ట్ లని తయారీ చేయలేకపోయాం.. కానీ, ఇప్పుడు ప్రధాని దూరదృష్టితో ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగారన్నారు.. కరోనా సమయంలో ప్రపంచదేశాలకి వాక్సిన్ అందించగలిగిన దేశం భారతదేశం.. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశారు.. భారతదేశం ప్రపంచ దేశాలకి ఆదర్శవంతంగా నిలిచింది.. డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా.. ఇలా టెక్నాలజీ పరంగా అభివృద్ధిలో ప్రధాని మోడీ మంచి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు..
BSNL ని అభివృద్ధి చేయటంలో ప్రధాని మోడీ కీలక పాత్ర వహించారని తెలిపారు చంద్రబాబు.. ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి తిరిగి రావచ్చు.. ఒకప్పుడు ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్ కి తిరిగేవాళ్లం.. కానీ, ఇప్పుడు వాట్సాప్ గవర్నన్స్ తో అన్ని సేవలు వినియోగించుకున్నాం.. దానికి కారణం 4G సేవలతో అన్ని విధాలుగా స్మార్ట్ వర్క్ చేసుకోగలుగుతున్నాం.. భవిష్యత్ లో ప్రపంచం మొత్తం ఫోన్ లు వినియోగిస్తే మేక్ ఇన్ ఇండియా అవుతుందన్నారు. త్వరలోనే 6జీ, 7జీ లు కూడా వస్తాయి అని వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
