Site icon NTV Telugu

CM Chandrababu: ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ సీఎం అయ్యారు..

Babu

Babu

CM Chandrababu: ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. అది ప్రజాస్వామ్య విజయం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారు.. ప్రజాస్వామ్యవాదులతో కలిసి 30 రోజులు పోరాటం చేసి ఎన్టీఆర్‌ విజయం సాధించారు.. ఇందిరా గాంధీ మెడలు వచ్చారని పేర్కొన్నారు.. భారత్‌లో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తిఅయిన సందర్భంగా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ.. ఆ అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ మానని గాయంగా మిగిలిందన్నారు.. ఇక, ఏపీలో ఆరేళ్ల కిందట ఇదే రోజు ప్రజా వేదిక కూల్చారని.. ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్లు సందర్భంగా ఈ సంవిధాన్‌ హత్యా దివస్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు చంద్రబాబు..

Read Also: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం.. పిస్టల్ స్వాధీనం..

భారతదేశం అతి పెద్ద ప్రజాసౌమ్యం.. దేశంలో ఎన్నో మలుపులు, సవాళ్లు, విజయాలు చూసాయి.. ప్రజాసౌమ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారత దేశం అన్నారు చంద్రబాబు.. అత్యవసర పరిస్థితి అనేది చీకటి రోజులు.. సమరం, నారాయణ.. వారి చీకటి రోజుల అనుభవాలని గుర్తుచేశారు.. మంచి రోజులే కాదు చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకుంటేనే ఏది మంచి ఏది చెడో తెలుసుకుంటాం అన్నారు.. 1975 జూన్ 25 ప్రపంచంలోనే ప్రజాసౌమ్యాన్ని పరిహాసం చేస్తూ అత్యవసర పరిస్థితిని విధించారు.. ఇప్పుడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రజలందరికి ఆనాటి అత్యవసర పరిస్థితి తెలియచేయాలని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుందన్నారు.. ప్రజల ప్రాధమిక హక్కులని కాలరాశారు.. అలహాబాద్ హైకోర్టులో ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు.. ప్రజాసౌమ్యంపై నమ్మకం ఉంటే మళ్లీ ఎన్నికలకి వెళ్లి గెలిచి చూపించవచ్చు.. కానీ, అహంకార ధోరణితో అత్యవసర పరిస్థితి విధించి ఎంతో విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Mahabubabad: అమ్మను చం*పిన.. ఆ ముగ్గురిని వదలొద్దు.. ఉరి శిక్షపడాలి

ఇక, కుటుంబ నియంత్రణని సైతం బలవంతంగా చేశారు.. బలవంతంగా ఆపరేషన్స్ చేసి అనేక ఇబ్బందులకి గురిచేశారని గుర్తుచేశారు చంద్రబాబు.. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఆ స్ఫూర్తితో పని చేయటం మనందరి బాధ్యత అన్నారు.. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి.. అమెరికాలో గుండె ఆపరేషన్ చేపించి ఇంటికి వస్తే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసారు.. మళ్లీ ఎన్నికలకి వెళ్లి ఎన్టీఆర్ విజయం సాధించి ప్రజాసౌమ్యాన్ని గెలిపించారు.. అలాగే, ఆంధ్రప్రదేశ్ 2019-24 లో ఒక ముఖ్యమంత్రిగా పని చేసి ప్రజలందరిని ఇబ్బందులకి గురిచేసారు.. అన్యాయం, అవినీతి, కబ్జాలు, రౌడీయిజం, ఎవరు గొంతు విప్పిన గొంతు నులిమే పరిస్థితిలో గత పాలకులు చేశారని ఫైర్‌ అయ్యారు.. మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ద్యేయంతో మిత్రుడు పవన్ కల్యాణ్‌, బీజేపీతో కూటమి కలిసి మంచి విజయాన్ని సాధించాము.. విధ్వంసం నుంచి ఈ రాష్ట్ర ప్రజలని కాపాడి పునర్ నిర్మిస్తామని ప్రజలందరికి హామీ ఇచ్చాం అన్నారు చంద్రబాబు.

Read Also: Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..!

భారత దేశం ఒక గొప్ప దేశం.. కొంత మంది చెడు చేసినా అది శాశ్వతం కాకుండా దేశం చూసుకుంది అన్నారు చంద్రబాబు.. ఇప్పుడున్న యువత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండటం మన అదృష్టం.. సరైన సమయం లో సరైన నాయకత్వం దేశానికి ఉందని వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version