Site icon NTV Telugu

PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్‌.. మరో కేసు నమోదు

Psr Anjaneyulu

Psr Anjaneyulu

PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు మళ్లీ షాక్‌.. పీఎస్సార్‌పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పటికే ముంబై నటి కాదాంబరి జిత్వానీ కేసులో ఈ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అరెస్ట్‌ అయిన విషయం విదితమే కాగా.. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.. అయితే, తాజాగా పీఎస్సార్‌పై మరో కేసు నమోదైంది.. ఏపీపీఎస్సీ గ్రూప్1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు.. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పీఎస్సార్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో.. ఈ అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిదంటూ ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో.. పీఎస్సార్ పై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఇప్పటికే పీఎస్సార్ పై సినీనటి జిత్వానీ వేధింపుల కేసు, రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు నమోదు అయిన విషయం విదితమే కాగా.. తాజాగా మూడో కేసు ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదు చేశారు పోలీసులు.. ఇలా వరుసగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Read Also: Padma Awards : బాలయ్య, అజిత్ కుమార్ కు పవర్ స్టార్ శుభాకాంక్షలు

Exit mobile version