Site icon NTV Telugu

Flights Cancelled: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు..

Flights Cancelled

Flights Cancelled

Flights Cancelled: తీరం వైపు దూసుకు వస్తుంది మొంథా తుఫాన్‌.. ఇప్పటికే తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారిపోయాయి.. మరోవైపు, అప్రమత్తమైన రైల్వే శాఖ.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధితో పాటు.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో కూడా పలు రైలు సర్వీసులను మూడు రోజుల పాటు రద్దు చేసింది.. ఇక, మొంథా తుఫాన్‌ నేపథ్యంలో అప్రమత్తమైన విమానయాన శాఖ.. మొంథా తుఫాను నేపథ్యంలో రేపు పలు విమానాలు విజయవాడ నుంచి రద్దు చేసినట్టు ప్రకటించారు..

Read Also: Fake Universities: దేశంలో 22 నకిలీ విశ్వవిద్యాలయాలు.. లిస్ట్ రిలీజ్ చేసిన యూజీసీ

ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు విజయవాడ నుంచి రేపు రద్దు చేస్తున్నట్టు ప్రకటంచింది ఎయిర్‌పోర్ట్ అథారిటీ.. IX 2819 విశాఖపట్నం – విజయవాడ, IX-2862 విజయవాడ – హైదరాబాద్‌, IX-2875 బెంగళూరు – విజయవాడ, IX-2876 విజయవాడ – బెంగళూరు, IX-976 షార్జా – విజయవాడ, IX-975 విజయవాడ – షార్జా, IX2743 హైదరాబాద్‌ – విజయవాడ, IX-2743 విజయవాడ – విశాఖపట్నం విమానాలను అక్టోబర్‌ 28వ తేదీన రద్దు చేసినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ.. ఇందులో షార్జా నుంచి రావాల్సిన.. షార్జాకు వెళ్లాల్సిన రెండు విమానాలను సైతం రద్దు చేశారు.. మొత్తంగా మొంథా తఫాన్‌ నేపథ్యంలో.. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన.. విజయవాడకు రావాల్సిన విమాన సర్వీసులను అన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది ఎయిరిండియా..

Exit mobile version