ACB Raids: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారితో పాటు కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అధికారులు అనధికార నగదును కూడా గుర్తించారు.. సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి, అనంతరం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుపుతున్నారు ఏసీబీ అధికారులు..
ACB Raids: ఏపీలో రెండో రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు..
- ఏపీ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతోన్న ఏసీబీ దాడులు..
- విజయవాడ ఇబ్రహీం పట్నం, పల్నాడు నరసరావుపేట తిరుపతి సహా..
- 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు..
- అనధికార నగదు గుర్తించిన అధికారులు..

Acb Raids