Site icon NTV Telugu

AP Liquor Scam Case: ఏసీబీ కోర్టులో కీలక వాదనలు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్‌ విధింపు

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రిటైర్ట్‌ ఐఏఎస్‌ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వోఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్‌ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. మద్యం కుంభకోణంలో కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం రోజు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సిట్‌ అధికారులు.. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగాయి.. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. మద్యం కుంభకోణం కేసులో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మూడు రోజులు పాటు రిమాండ్‌ విధించింది న్యాయస్థానం.. అంటే.. ఇద్దరికీ ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.. దీంతో.. ఇద్దరు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.. అయితే, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వయస్సు రీత్యా.. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించిందిన.. వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్‌కు అనుమతి ఇచ్చింది.. ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది ఏసీబీ కోర్టు..

Read Also: Heart attack : పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలి వ్యక్తి మృతి..

Exit mobile version