Site icon NTV Telugu

AP Liquor Scam Case: లిక్కర్‌ కేసు నిందితులకు బిగ్ షాక్‌.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి

Court

Court

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ కు అనుమతి ఇస్తూ 111, 126 జీవోలు ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, కోర్టు అనుమతి ఇవ్వాలని సిట్‌ వేసిన పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వటంతో ఆస్తుల అటాచ్ మెంట్ కోసం కేసులో 11 మంది నిందితులకు వారెంట్లు జారీ చేసేందుకు సిద్ధమైంది సిట్‌..

Read Also: India – Afghanistan: పాకిస్తాన్‌కు భారత్ దెబ్బ.. ఆఫ్ఘాన్ నదిపై డ్యామ్ నిర్మాణానికి మద్దతు.!

కాగా, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు గతంలోనే అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఆ తర్వాత ఆదేశాలతో 62.86 కోట్లకు చేరిన నిందితుల ఆస్తులు, నగదు అటాచ్ మెంట్.. అయితే, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా.. ఇది ముందకు సాగలేదు.. దీంతో, మరోసారి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది సిట్‌..

Exit mobile version