NTV Telugu Site icon

Vijayawada Crime: ఏం కష్టం వచ్చిందో ఏమో.. పెళ్లైన మూడు నెలలకే..?

Newly Married Woman Suicide

Newly Married Woman Suicide

Vijayawada Crime: విజయవాడలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే నవ వధువు అత్తారింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలీదు కానీ, ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడు నెలల క్రితం నున్నలో ఉండే సురేష్ కుమార్‌కి హేమతేజతో వివాహం అయ్యింది. ఆషాడం కావడంతో పెళ్లైన కొన్ని రోజులకే పుట్టింటికి వెళ్లింది. ఆషాడం తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లింది. ఏమైందో ఏమో తెలీదు కానీ.. అత్తింటికి వెళ్లాక హేమతేజ ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. అత్తారింటోళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే హేమతేజ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందజేశారు. దీంతో.. వాళ్లు వెంటనే అత్తారింటికి చేరుకున్నారు. తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శోకసంద్రంలో మునిగారు. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Bramhanandam : బ్రహ్మనందం రెండో కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..

అత్తారింట్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అంటే.. పెళ్లైన వెంటనే ఆషాడం రావడంతో హేమతేజ పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆషాడం ముగిశాకే అత్తారింటికి వచ్చింది. అత్తింటికి రాగానే ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో.. హేమతేజ సూసైడ్ మిస్టరీగా మారింది. అత్తారింట్లో ఏమైనా జరిగిందా? లేకపోతే హేమతేజ సూసైడ్‌కి ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లైన మూడు నెలలకే నవ వధువు చనిపోవడంతో.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

Show comments