Vijayawada to Sharjah: విజయవాడ నుంచి షార్జాకి నేరుగా రాకపోకలు సాగించే ఎయిరిండియా విమాన సర్వీసులు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సోమవారం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇదే తొలి విమాన సర్వీసు కావటం విశేషం. స్టార్టింగ్ ఆఫర్ కింద టికెట్ ప్రారంభ ధర 13,669 రూపాయలని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్జా నుంచి విజయవాడకి సర్వీస్ ఛార్జ్ 8,946 రూపాయలుగా నిర్ణయించారు.
read also: Vellampalli Srinivas: నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తాం.. ఇదే మా ప్రభుత్వం గొప్పతనం..!!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్యాసింజర్లకు విజయవాడ-షార్జా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతోపాటు మస్కట్, కువైట్‌కు సైతం తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఎయిరిండియా ప్రస్తుతం విజయవాడ నుంచి మస్కట్ మరియు కువైట్‌లకు మాత్రమే విమానాలను నడుపుతోంది.
కొవిడ్ నేపథ్యంలో రెండు సంవత్సరాల విరామం అనంతరం మళ్లీ అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తుండటం సంతోషకరంగా ఉందని అలోక్ సింగ్ చెప్పారు. ఇండియా-గల్ఫ్ ఏవియేషన్ సెక్టార్ త్వరగా కోలుకుందని, తిరిగి కరోనా ముందు నాటి పరిస్థితుల దిశగా పయనిస్తోందని తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్లకు రాకపోకలు సాగించే ఏకైక ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మాత్రమే కావటం విశేషం.
