Site icon NTV Telugu

Vijayawada Crime: ఘోరం.. గంజాయి మత్తులో మైనర్ బాలికని నరికి చంపిన రౌడీ షీటర్

Vijayawada Crime

Vijayawada Crime

Vijayawada Rowdy Sheeter Killed A Minor Girl Rani: విజయవాడలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో కుక్కల రాజు అనే రౌడీ షీటర్ ఓ మైనర్ బాలికని నరికి చంపాడు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఘోరం జరిగింది. కంటిచూపు లేని రాణి అనే మైనర్‌ను రాజు అత్యంత కిరాతకంగా చంపాడు. మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అతడు ఈ కిరాతక పనికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి మనోహరం వెంటనే ఇంటికి చేరుకొని, విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసిన బోరున విలపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రౌడిషీటర్ రాజుపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ బాలిక మృతదేహాన్ని తరలించారు. బాలికను హత్య చేసిన అనంతరం కుక్కల రాజు పరారీయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్‌ లేఆఫ్‌లు

ఈ ఘటనపై మృతురాలి తల్లి మనోహరం మాట్లాడుతూ.. ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశాడు. కళ్లు కనిపించవనే కనికరం కూడా లేదు. నిన్న రాజు గంజాయి సేవించే వచ్చాడు. నేను అసభ్యంగా ప్రవర్తించటం లేదని‌ చెప్పి వెళ్లిపోయాడు. అరగంటలో వెనక్కి వచ్చి చూసేసరికి గొడ్డలితో నా కూతురిని నరికి చంపాడు. నా పిల్ల అబద్దాలు చెప్పదు.. వాడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆడుకుంటున్న పిల్లను అన్యాయంగా నరికేశాడు. గతంలో కూడా కుక్కల రాజు కొందరిపై కత్తితో దాడి చేశాడు. గంజాయి ముఠా ఆగడాలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇళ్ల మీదకు వెళ్లి రాజు అల్లరి చేస్తున్నాడు. నాకు న్యాయం చేయాలి.. వాడిని కఠినంగా శిక్షించాలి’’ అంటూ రోదించింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మైనర్ తన తల్లికి చెప్పడం వల్లే.. కుక్కల రాజు ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Pini Village: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు వేసుకోరు.. ఎందుకో తెలుసా?

Exit mobile version