సినిమా థియేటర్లకు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిపోయింది… కొత్తి సినిమా విడుదలైన సందర్భంగా తమకు ప్రతీ షోకి వంద టికెట్లు ఇవ్వాలని లేఖలో థియేటర్ల యాజమాన్యాలను కోరారు మేయర్… కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో ఒక రకంగా తమకు ఎదురైయ్యే ఇబ్బందులను కూడా లేఖలో పేర్కొన్నారామె.. ప్రతీ నెల కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయని.. అయితే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో టికెట్లు కావాలని పార్టీ ప్రతినిధులు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Goa Results: గోవాలో బీజేపీ హ్యాట్రిక్
కావున, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా తమకు ప్రతీ షోకు 100 టికెట్లు ఇవ్వాలని.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మేయర్ చాంబర్‌కు వంద టికెట్లను పంపించాలని లేఖలో పేర్కొన్నారు మేయర్ భాగ్యలక్ష్మి.. అయితే, ఆ సినిమా టికెట్లకు సంబంధించిన డబ్బును తామే చెల్లిస్తామని లేఖలో సినిమా థియేటర్ల యాజమాన్యాలను కోరారు మేయర్. మొత్తంగా సినిమా థియేటర్లకు టికెట్ల కోసం మేయర్ లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.