NTV Telugu Site icon

Vijayawada Drugs Case: ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు

Drugs Vja

Drugs Vja

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విజయవాడ ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిషేధిత ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న అరుణాచలం ను ముందుగా కస్టడీకి తీసుకోనున్నారు బెజవాడ పోలీసులు. డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులతో సంయుక్తంగా నిందితులను పట్టుకునేందుకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

అరుణాచలం ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే బెజవాడలో రిక్కి నిర్వహించిన ఆ ఇద్దరి సెల్ ఫోన్స్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడ నుండి రెండు ప్రత్యేక టీంలు చెన్నైలో మకాం వేశాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షుణ్ణంగా దర్యాప్తు సాగిస్తున్నారు బెజవాడ పోలీసులు. చెన్నైలోని బర్మా బజార్ లో 50 లక్షల విలువైన స్మగుల్డ్ వస్తువులు తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు అరుణాచలం.

ఇటీవల ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ను కొరియర్ చేసిన నిందితులను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి కొరియర్ చేస్తే తెలిసిపోతుందన్న ఉద్దేశంతోనే నిందితులు విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేసేందుకు ప్రయత్నించారు. చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తి విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేసిన సంగతి తెలిసిందే. కొరియర్ చేసేటప్పుడు గోపిసాయి అనే వ్యక్తి ఆధార్ ను ఫోర్జరీ చేసి అరుణాచలం వాడుకున్నాడు. కొరియర్ సంస్థలు తమ కస్టమర్లకు సంబంధించి వివరాల విషయంలో అప్రమత్తంగా వుండాలని, కొరియర్ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై విదేశాలకు పంపించే కొరియర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామంటున్నారు పోలీసులు.

North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయతాండవం… 21 మంది మృతి