Site icon NTV Telugu

వినోద్‌ జైన్‌ను బహిరంగంగా ఉరి తీయాలి: విజయసాయిరెడ్డి

విజయవాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కలకలకం రేపిన సంగతి తెల్సిందే. ఆమె ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పార్టీ నేత వినోద్‌ జైన్‌ ను ఆ పార్టీ ఇప్పటికే సస్పెండ్‌ చేసింది. మరో పక్క తెలుగు దేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో బాలిక ఆత్మహత్య ఘటన పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా తన స్టైల్‌ లో ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు.

Read Also: ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపులపై ప్రభుత్వం ఫోకస్‌

“చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే బానిస పార్టీల నేతలెవరూ14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు. పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు టీడీపి నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు.” అంటూ సంచలన ట్విట్టర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో అరెస్ట్‌ అయిన వినోద్‌ జైన్‌.. పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెల్సిందే..


Exit mobile version