‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజు చంద్రబాబుకే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని..ఈ విషయంలో వారికి ఫస్ట్ ప్రైజు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. “కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు ప్రచారం ఈ ఏడాది ప్రపంచస్థాయి ‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజుకు ఎంపికైనట్టే. కొన్నేళ్లుగా ఈ పురస్కారం బాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతుండటం తెలుగు ప్రజల గ్రహచారం.” అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
ఇక అంతకు ముందు ట్వీట్ లో “దరిద్రం ఫెవికాల్‌లా పట్టుకోకపోతే 5 కోట్ల ప్రజల గురించి ఏనాడూ ఆలోచించని నువ్వు…ఉస్కో అంటే ఎగబడే వ్యక్తిని కాపాడేందుకు ఇంతగా తెగబడటమేమిటి? ప్రజా క్షేత్రంలో ఏమని జవాబు చెబుతావు. కేంద్రం నుంచి తగినంత ఆక్సిజన్ సరఫరా లేక రోగులు యాతన పడుతుంటే ఒక్క లేఖ అయినా రాశావా? ఆస్పత్రులు, విద్యా సంస్థలు, వ్యవస్థలకు విశ్వసనీయత లేకుండా వాటిని భ్రష్టు పట్టించావు కదా చంద్రబాబు. ఒక ఆస్పత్రిని పచ్చ పార్టీ బ్రాంచి ఆఫీసు స్థాయికి దిగజార్జావు. అగ్నికీలల్లో 10 మంది కరోనా రోగులు ఆహుతైపోతే ఆ ఆస్పత్రి యాజమాన్యాన్ని వెనకేసుకొచ్చావు. ప్రజలపై ఎంత కక్ష కట్టావు బాబూ!” అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
- Tags
- ap
- chandrababu
- tdp
- vijayasaireddy
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!