Site icon NTV Telugu

‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజు చంద్రబాబుకే !

నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని..ఈ విషయంలో వారికి ఫస్ట్ ప్రైజు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. “కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు ప్రచారం ఈ ఏడాది ప్రపంచస్థాయి ‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజుకు ఎంపికైనట్టే. కొన్నేళ్లుగా ఈ పురస్కారం బాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతుండటం తెలుగు ప్రజల గ్రహచారం.” అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

ఇక అంతకు ముందు ట్వీట్ లో “దరిద్రం ఫెవికాల్‌లా పట్టుకోకపోతే 5 కోట్ల ప్రజల గురించి ఏనాడూ ఆలోచించని నువ్వు…ఉస్కో అంటే ఎగబడే వ్యక్తిని కాపాడేందుకు ఇంతగా తెగబడటమేమిటి? ప్రజా క్షేత్రంలో ఏమని జవాబు చెబుతావు. కేంద్రం నుంచి తగినంత ఆక్సిజన్ సరఫరా లేక రోగులు యాతన పడుతుంటే ఒక్క లేఖ అయినా రాశావా? ఆస్పత్రులు, విద్యా సంస్థలు, వ్యవస్థలకు విశ్వసనీయత లేకుండా వాటిని భ్రష్టు పట్టించావు కదా చంద్రబాబు. ఒక ఆస్పత్రిని పచ్చ పార్టీ బ్రాంచి ఆఫీసు స్థాయికి దిగజార్జావు. అగ్నికీలల్లో 10 మంది కరోనా రోగులు ఆహుతైపోతే ఆ ఆస్పత్రి యాజమాన్యాన్ని వెనకేసుకొచ్చావు. ప్రజలపై ఎంత కక్ష కట్టావు బాబూ!” అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

Exit mobile version