Site icon NTV Telugu

అభ్యర్థులు దొరకని స్థితి నీది…నవ్వులుపాలు కావొద్దు చంద్రబాబు!

Vijaya Sai Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి టిడిపిది అని.. బక్వాస్ మాటలతో నవ్వులపాలు కావొద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. “ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం. స్వీయ ఆరాధన ఏ స్థాయికి చేరిందంటే 5 కోట్ల మంది ప్రజలు తనను తిరస్కరించి సరిదిద్దుకోలేని తప్పు చేశారని భ్రమపడుతున్నాడు. వాళ్లకు ఇంత చైతన్యం ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నాడు బాబు. రెండేళ్ల తర్వాత కూడా అలాగే ఆలోచిస్తున్నాడంటే మెంటల్ కండిషన్ అనుమానించాల్సిందే.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో “సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020-21 ఏడాదికిగానూ రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్‌ ర్యాంక్‌లు విడుదల చేసింది. పలు అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీ.. టాప్‌-5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 72 పాయింట్లతో మూడోస్థానం దక్కించుకుంది. క్లీన్‌ ఎనర్జీ విభాగంలో టాప్‌ ర్యాంక్‌ సాధించింది.” అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Exit mobile version