టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యరు. కుప్పం ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏంటని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వెన్నుపోటుల గురించి చంద్రబాబు చెప్పడమేంటని ఆయన అన్నారు.
పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్ను పోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్‌కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా బాబూ? అంటూ ట్విట్ చేశారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిపై ఎప్పుడు విమర్శల దాడికి దిగుతారు
