Site icon NTV Telugu

VijayaSaiReddy: పొత్తులు లేకుండా గెలిచి జగన్ చరిత్ర సృష్టించారు

Vijayasai Reddy

Vijayasai Reddy

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఏపీలో వైసీపీ చరిత్ర సృష్టించింది. 175 అసెంబ్లీ సీట్లకు 151 సీట్లను, 25 పార్లమెంట్ సీట్లకు 22 సీట్లను కైవసం చేసుకుని రికార్డు మెజారిటీతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీని మట్టికరిపించి కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ అద్భుత విజయం సాధించిన తేదీ మే 23. ఈ నేపథ్యంలో మ‌రిచిపోలేని విజ‌యాన్ని గుర్తు చేసుకుంటూ సోమ‌వారం నాడు వైసీపీ కార్యకర్తలు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Somu Veerraju: ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమే.. దమ్ముంటే చర్చకు వస్తారా?

అటు వైసీపీకి అధికారం కట్టబెడుతూ ప్రజలిచ్చిన తీర్పు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఒంటరిగా సైన్యాన్ని నడిపించి అఖండ విజయాలు సాధించిన పరాక్రమవంతులు ఏడుగురు అని ప్రపంచ చరిత్ర చెబుతోందని.. వారిలో అలెగ్జాండర్ ద గ్రేట్, అశోక చక్రవర్తి, మహారాణా ప్రతాప్ కూడా ఉన్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. పొత్తుల్లేకుండా పోరాడి గెలిచిన నేతగా జగన్ కూడా వర్తమాన రాజకీయ చరిత్రలో నిలుస్తారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు అంటూ వైసీపీ తన అధికార ట్విట్టర్ పేజీ ద్వారా పోస్ట్ పెట్టింది.

Exit mobile version