Vijayasai Reddy Tweet On 2000 Note Withdrawn: శుక్రవారం సాయంత్రం రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు.. రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్‌లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ 2 వేల నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపారు. తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ట్విటర్ మాధ్యమంగా తెలిపారు. నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దు చేయాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
Kavya Thapar: రెడ్ డ్రెస్ లో ‘బిచ్చగాడు 2’ బ్యూటీ సెగలు పుట్టిస్తుందిగా
కాగా.. ఈ 2 వేల నోట్లను మార్చుకోవాలంటే, దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. అందుకు ఆ బ్యాంక్ వాళ్లు మనకు రూ. 500, రూ.100 నోట్ల కింద తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసినా సరిపోతుంది. అయితే.. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విడతలో, అంటే రోజుకి 10 నోట్లు మాత్రమే మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలుంటుంది. సెప్టెంబర్ 30 దాకా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆందోళన చెందకుండా ఆలోపు వీలున్నప్పుడు నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా లేకపోతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి, అక్కడ రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ఇదిలావుండగా.. 2016 నవంబర్ నోట్ల రద్దుని ప్రకటించినప్పుడు.. రూ.2 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ నోట్ల చలామణి తగ్గడంతో, ఆర్బీఐ 2018-19లో ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఇప్పుడు వీటిని పూర్తిగా రద్దు చేస్తూ.. ప్రకటన జారీ చేసింది.
AP BJP: ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.. క్లాస్ పీకిన ప్రధాన కార్యదర్శి